Tuesday, August 14, 2007

To the newwestly

న్యువెస్లీ కి ప్రయాణం ఒకటి - అంకం
రైల్వే స్తెషన్లో....ప్లాట్ ఫారం నిండా జనం....ఆందోలనతో, బయంతో,ఎదురుచూస్తున్నారు....తమ పిల్లలను మాటి మాటికీ పరిశీలిస్తున్నారు....అంతలోనే వారు ఎదురుచూస్తున్న ట్రేయిన్ వచ్చి ప్లాట్ ఫారం మీద ఆగింది....సముద్రంలో మునిగి పోతున్న జనాన్ని కాపాడటానికి వచ్చిన పడవలా....ఇంతలో అందరూ ఎక్కేశారు. ఓ నలుగురుతప్ప.... అమ్మా ఎందుకలా విచారంగా ఉన్నావ్. ఏం జరిగింది? అసలందరూ అలా ఎందుకు బయపడుతున్నరు? అడిగాడు ఎనమిది సంవత్సరాల ప్లాజా ముద్దు ముద్దుగా తనని ఎత్తుకున్న అమ్మని ,గదువను పట్టుకొని. యేయ్, ప్లాజా నీకెందుకిదంతా పద ట్రేయిన్ టయిమయ్యింది, ఎక్కుదాం అంది పన్నెండు సంవత్సరాల సోషా ,ప్లాజా అక్కయ్య . నువ్ చెప్పమ్మా అక్కయ్యకెప్పుడూ తొందరే. చిన్నూ....మన నగరంలో ఒక బయంకరమైవ్యాది వ్యాపిస్తొందట, అది పిల్లలకు మాత్రమే వస్తోంది. అంతే ఆ పిల్లలు చనిపోథున్నారట అందుకని మిమ్మల్ని బాబాయ్ ఉండే న్యువెస్లీ నగరానికి పంపిస్తున్నాను. నేను, నాన్న రాగానే ఇద్దరం కలిసి వస్తాం, నువ్వు అక్క చెప్పినట్టు నదుచుకో, అక్కను హౌస్ కీపర్ మేరీ ఆంటీని ఇబ్బంది పెట్టకు అంది ప్లాజా తల్లి . మేడం, చివరి బయలుదేరు ప్రకటన కూడా అయిపోయింది మీరు సెలవిస్తే ట్రేయిన్ ఎక్కుతాం అంటూ ప్లాజాను ఒడిలోకి తీసుకుంది హౌస్ కీపర్ మేరి . అన్ని బందాల కంటే తల్లి బందం తీయనైనది, ఎప్పుడూ ప్లాజాను విడచి ఉండని ఆమె తన మనసు అల్లల్లాదుతున్నా పిల్లల బాగుకోసం దూరంగా ఉన్న ఊరికి పంపించింది. చివరగా ఇద్దరికీ బాదతో అప్యాయంగా ముద్దులు పెత్తింది.అమ్మా ఇక వెల్తాం అంది సొష. సరే పద అంటూ ట్రేయిన్ బోగీ దగ్గరకు వచ్చి వాల్లను ఎక్కించి తను ప్లాట్ ఫారం మీద నిలుచుంది మేరీ, వీల్లను జాగ్రత్తగా చూసుకో అంటూ ప్లాజా చెంప నిమిరింది. ఇంతలో ట్రేయిన్ కూత పెట్టి బయలు దేరింది ట్రేయిన్ తో పాటు నడుస్తూ వాల్లను విడవలెని మనసు తహతహలాడింది, ట్రేయిన్ వేగం పెంచుకోవడంతొ ఒక దగ్గర నిలచిపొయింది. చెతులూపుతూ, చెతులూపుతూ ట్రేయిన్ మలుపుతిరగటంతొ వీల్లు తలుపు దగ్గరి నుంచి లోపటికి వెల్లి కూర్చున్నారు.